Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

32వ వార్డులో బిజెపి అభ్యర్థి మేడి సుమలత కోటేష్ ఇంటింటి ప్రచారం

03-02-2026 244 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

అవకాశమిస్తే సంపూర్ణ అభివృద్ధి చేస్తా : వార్డు ప్రజలకు హామీ

భువనగిరి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక తారకరామా నగర్ 32వ వార్డుకు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా మేడి సుమలత కోటేష్‌కు పార్టీ బీ-ఫారం అందజేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బిజెపి పార్టీ అభ్యర్థి 32వ వార్డులో గడప గడపకు తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలను కలిసిన మేడి సుమలత కోటేష్ మాట్లాడుతూ,వార్డులో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించి సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో బిజెపి పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు అన్ని పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ఒకసారి నాకు అవకాశం ఇస్తే, నిత్యం ప్రజల్లో ఉంటూ వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తాను అని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో ప్రజలను కలిసి,తమ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుకు వేసి 32వ వార్డు కౌన్సిలర్‌గా గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. వార్డు ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు,వార్డు కమిటీ సభ్యులు,మహిళా నాయకులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

32వ వార్డులో బిజెపి అభ్యర్థి మేడి సుమలత కోటేష్ ఇంటింటి ప్రచారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News