Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

2వ వార్డు అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించండి

07-02-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా ఫిబ్రవరి11న జరిగే మున్సిపల్ ఎన్నికలలో చౌటుప్పల్ మున్సిపల్ పరిధి తాళ్ల సింగారం గ్రామ సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను కొనసాగుతున్నాను.కావున చౌటుప్పల్ మున్సిపాలిటీకి అభివృద్ధి పనులు జరగాలంటే అధికార పార్టీకి ఓటేసి గెలిపించాలని ఆయన వార్డు ప్రజలను కోరారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నిత్యం ప్రజల్లో ఉండే సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను గెలిపించినట్లయితే 2వ వార్డు మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు 20 వార్డులు గెలిచి తీరుతామని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

2వ వార్డు అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News