Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 11:39 AM

2బీహెచ్‌కే ఇళ్ల పనులు వేగవంతం చేయాలి. అదనపు కలెక్టర్

18-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరిలో అదనపు కలెక్టర్ సమీక్ష – శాఖలకు స్పష్టమైన ఆదేశాలు

భువనగిరి పట్టణంలో నిర్మాణంలో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఏ. భాస్కరరావు, IAS అధికారులకు ఆదేశించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.

మిగిలిపోయిన పనులపై వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సింగన్నగూడెం 2బీహెచ్‌కే కాలనీలో నీటి సరఫరా కోసం మిషన్ భగీరథ కింద ట్యాపింగ్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి గృహాలకు కనెక్షన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా అమృత్ పథకం కింద వాటర్ పైప్‌లైన్ల ఏర్పాటును వేగవంతం చేయాలని, విద్యుత్ సరఫరాకు సంబంధించి మిగిలిన పనులను మున్సిపాలిటీ తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. మిగులు నిధులను వినియోగిస్తూ హౌసింగ్ శాఖ ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ పనులను త్వరగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జి. రామలింగం, మున్సిపల్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, విద్యుత్, హౌసింగ్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

2బీహెచ్‌కే ఇళ్ల పనులు వేగవంతం చేయాలి. అదనపు కలెక్టర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News