కమలం గుర్తుకే ఓటు వేయాలి
పిడమర్తి నాగేశ్వరి పిలుపు
సూర్యాపేట మున్సిపాలిటీ 23వ వార్డులో బీజేపీ పార్టీ ప్రచారం వేగంగా కొనసాగుతోంది. 23వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి పిడమర్తి నాగేశ్వరి మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.అవినీతిని కాకుండా అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 23వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను కమలం గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వార్డు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల మద్దతుతో విజయం సాధించి 23వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి