ఇంటింటి ప్రచారంతో ప్రజల్లోకి మోత్కూరి దుర్గమ్మ
సూర్యాపేట:
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మోత్కూరి దుర్గమ్మ బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వార్డు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.
ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, బీఆర్ఎస్ పార్టీపై నమ్మకంతో ప్రజలు మద్దతు తెలుపుతున్నారని ఆమె పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి