Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:34 AM

20 ఏళ్ల సేవలకు కనీస వేతనాలైనా ఇవ్వండి..! వేముల బక్కయ్య

24-02-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పాఠశాల కార్మికుల పక్షాన వేముల బక్కయ్య ఘాటు ప్రశ్నలు

ముసునూరు మండలం, సూరేపల్లి:

రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్డే మీల్స్, శానిటేషన్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న వర్కర్లకు కనీస వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఎందుకని (ఏఐసిసిటియు) జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

20 సంవత్సరాల పైబడి సేవలందిస్తున్న కార్మికుల కుటుంబాల జీవన పరిస్థితులను ప్రభుత్వం ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో పరిశీలించిందా? అని ఆయన ప్రశ్నించారు. కార్మికులుగా అధికారిక గుర్తింపు లేకపోవడం, గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు లేకపోవడం, యూనిఫామ్‌లు, వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం వెట్టిచాకిరికాదా? అని నిలదీశారు.

ఇంకెన్ని సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలల్లో వెట్టి చాకిరి చేయించుకుంటారని ప్రశ్నించిన బక్కయ్య, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు, పేరెంట్స్ కమిటీల అజామాయిషీ కార్మికులను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా” కార్మికుల పరిస్థితి తయారైందన్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే…

నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి

రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి

నెలకు కనీసం రూ.36,000 వేతనం చెల్లించాలి

పదవీ విరమణ తర్వాత రూ.10,000 పెన్షన్ కల్పించాలి

చెల్లింపు సెలవులు మంజూరు చేయాలి

మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి

ఈ డిమాండ్ల సాధన కోసం మార్చి 2న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాఠశాల కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పల్లె పాము భవాని, కంకట శిరోమణి, కంకట సుజాత, పొజ్జూరు సత్యవాణి, బందెల ధనలక్ష్మి, బందేల రుక్మిణి, సాయిల వెంకటరమణ, సాయిల వెంకమ్మ, ఉలాస నాగమ్మ, పేరిచర్ల తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

20 ఏళ్ల సేవలకు కనీస వేతనాలైనా ఇవ్వండి..! వేముల బక్కయ్య

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News