Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:23 AM

18 ఏళ్ల తర్వాత ఒకేచోటకు.. న్యాల్కల్ జెడ్పీహెచ్‌ఎస్ 2007-08 బ్యాచ్ ‘మైత్రి మిలన్’కు సర్వం సిద్ధం

15-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్)లో 2007-2008 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 18 ఏళ్ల తర్వాత మరోసారి కలుసుకోబోతున్నారు. “మైత్రి మిలన్” పేరుతో నిర్వహిస్తున్న ఈ ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మే 17న న్యాల్కల్‌లోని శ్రీ కృష్ణ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరగనుంది.చిన్ననాటి స్నేహాలు, పాఠశాల జ్ఞాపకాలు, గురువుల బోధనలు, సరదా సంఘటనలను మరోసారి గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఈ సమావేశానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదువు పూర్తై ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతలతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన స్నేహితులు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒకేచోట కలుసుకోనుండటం విశేషంగా మారింది.ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు కోసం గురువులు నిరంతరం కృషి చేస్తారని, జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను జీవితాంతం గౌరవించాలని సూచించారు. విద్యార్థి విజయం సాధిస్తే గురువులకు గర్వంగా ఉంటుందని, విఫలమైతే ముందుగా బాధపడేది కూడా గురువులేనని తెలిపారు.సమ్మేళనంలో ప్రధాన ఉపాధ్యాయులు రాజప్ప, పద్మయ్య, లాలయ్య, అనంత్ రెడ్డి, మీనా, కవిత, గౌతం, శ్రీనివాస్, తుకారాం, పద్మవతి,

నరసింహారెడ్డి తో

పాటు పూర్వ విద్యార్థులు పాల్గొననున్నారు. హైదరాబాద్, , సంగారెడ్డి, జహీరాబాద్, బీదర్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరుకానుండటంతో న్యాల్కల్‌లో పూర్వ విద్యార్థుల కలయికకు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.

Sthanikam

18 ఏళ్ల తర్వాత ఒకేచోటకు.. న్యాల్కల్ జెడ్పీహెచ్‌ఎస్ 2007-08 బ్యాచ్ ‘మైత్రి మిలన్’కు సర్వం సిద్ధం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News