Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:05 PM

17వ వార్డు ఏకగ్రీవంపై బిగ్ ట్విస్ట్

17వ వార్డు ఏకగ్రీవంపై బిగ్ ట్విస్ట్

17వ వార్డు ఏకగ్రీవంపై బిగ్ ట్విస్ట్
04-02-2026 441 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికపై తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి చింతల ఉమామహేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక అక్రమమని ఆరోపిస్తూ కాలనీవాసులు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. వార్డులో 1430 మంది ఓటర్లు ఉన్నప్పటికీ తమకు ఓటు హక్కు లేకుండా ఏకగ్రీవం ప్రకటించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆందోళనకారులు వాపోయారు. ఏకగ్రీవ ఎన్నికను వెంటనే రద్దుచేసి, వార్డులో యధావిధిగా ఎన్నికలు నిర్వహించి తమకు ఓటు హక్కు కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఓటు హక్కు కల్పించకపోతే 'మేమంతా చనిపోయినట్టేనని..ఇందుకోసం మా అందరికీ మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి' అంటూ కాలనీవాసులు భీష్మించుకు కూర్చోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.మున్సిపల్ కార్యాలయం వద్దకు కాలనీవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఓటర్ల అపనిందలు.. అభ్యర్థి ఆత్మహత్య యత్నం

17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసి చివరి నిమిషంలో ఉపసంహరించుకున్న పస్తం మల్లమ్మ బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. డబ్బులు తీసుకొని నామినేషన్ ఉపసంహరణ చేసుకొని వార్డులో ఎన్నికలు లేకుండా చేశావంటూ కాలనీవాసులు చివాట్లు.. అపనిందలు వేయడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. తన ఇంట్లోనే చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది పార్టీ కార్యకర్తలు గమనించి మల్లమ్మను కాపాడారు.

Sthanikam

17వ వార్డు ఏకగ్రీవంపై బిగ్ ట్విస్ట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News