Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:41 AM

150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
11-03-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని దుందిరాలపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 150 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

తునికిపాడు గ్రామానికి చెందిన కొమ్మినేని వెంకటేశ్వరరావు గ్రామాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, ఆ బియ్యాన్ని కోళ్ల ఫారాల్లో మేతగా వినియోగించుకునేందుకు పొలంలో నిల్వ చేసినట్లు వెల్లడైంది.

సమాచారం అందుకున్న తహసీల్దార్ వి. రాజాకుమారి స్థానిక ఎస్సై జి. అనిల్, పిడిఎస్ డిప్యూటీ తహసీల్దార్ శివ నాగరాజుతో కలిసి ఘటన స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ నిల్వ చేసిన మొత్తం 300 బస్తాల్లో ఉన్న 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు.

ఈ ఘటనపై కొమ్మినేని వెంకటేశ్వరరావుపై 6ఏ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Sthanikam

150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News