Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

150 ఏళ్ల చరిత్ర గల శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన మాధవానంద స్వామి

09-03-2026 269 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయాన్ని మాధవానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ శ్రీ మాధవానంద స్వామి సందర్శించారు.

ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాల నేపథ్యంలో దేవాలయ అభివృద్ధి పనుల గురించి దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాస్ గౌడ్ స్వామిజీకి వివరించారు.

ఈ సందర్భంగా మాధవానంద స్వామి మాట్లాడుతూ, పురాతనమైన ఈ దేవాలయాన్ని సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ ఆలయం సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని తెలిపారు.

ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు సక్రమంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, దేవాలయ అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాస్ గౌడ్‌కు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు కొండూరు నరసింహ శర్మ, కొండూరు మనోహర్ రావు, కొండూరు వెంకట కిషన్ రావు, దేవాలయ ప్రధాన కార్యదర్శి దోర్నాల నరేష్, కోశాధికారి కొండూరు వికాస్‌, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

150 ఏళ్ల చరిత్ర గల శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన మాధవానంద స్వామి

Article Image

చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయాన్ని మాధవానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ శ్రీ మాధవానంద స్వామి సందర్శించారు.

ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాల నేపథ్యంలో దేవాలయ అభివృద్ధి పనుల గురించి దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాస్ గౌడ్ స్వామిజీకి వివరించారు.

ఈ సందర్భంగా మాధవానంద స్వామి మాట్లాడుతూ, పురాతనమైన ఈ దేవాలయాన్ని సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ ఆలయం సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని తెలిపారు.

ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు సక్రమంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, దేవాలయ అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాస్ గౌడ్‌కు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు కొండూరు నరసింహ శర్మ, కొండూరు మనోహర్ రావు, కొండూరు వెంకట కిషన్ రావు, దేవాలయ ప్రధాన కార్యదర్శి దోర్నాల నరేష్, కోశాధికారి కొండూరు వికాస్‌, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News