Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

11వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం

09-02-2026 255 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పున్న కైలాస్ నేత కాంగ్రెస్ పార్టీ నల్లగొండ అధ్యక్షులు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుంది

చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎలక్షన్ లో భాగంగా సోమవారం 11 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోశిక వినయ్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ నల్గొండ జిల్లా అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా చేయి గుర్తుపై తన అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత 2 సం;లుగా రోజుకు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ అభివృద్ధి పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి తిరుగులేదు.అభివృద్ధి సంక్షేమం వారి నాయకత్వంలో ముందుకు సాగుతుంది. అప్పులు పాలైన తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో 70% పైగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.నల్గొండ జిల్లాలో జరుగుతున్న నల్గొండ కార్పొరేషన్ లో సహా 6 మున్సిపాలిటీలను కైవనం చేసుకుంటాం. బిఆర్ఎస్ బిజెపికి ఓటు వేస్తే దండగ సంక్షేమ పథకాలు ఆగిపోతాయి.గత 2 సంవత్సరాలుగా 19 వేల కోట్లు నిధులను పట్టణాలకు ఖర్చు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి దే. సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, కొత్త సిసి రోడ్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం,200 ఉచిత యూనిట్ల కరెంటు 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మ చీరలు ప్రజాపాలనలో అందిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం. బిఆర్ఎస్ బిజెపి లు అక్రమ సంపాదనతో గెలవాలని చూస్తున్నారు. వారికి ఓటు వేస్తే మురికి కాల్వలో వేసినట్లే. జిల్లాలో బిఆర్ఎస్, బిజెపికి అభ్యర్థులు కరువు అయ్యారు. 2029లో తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నది. ముఖ్యమంత్రిగా రెండవసారి రేవంత్ రెడ్డి అవుతారు. ఈ కార్యక్రమంలో సామల భాస్కర్, పబ్బు రాజు గౌడ్, బడుగు లక్ష్మయ్య, చింతల వెంకటరెడ్డి, పాలకూర్ల స్వామి, గుర్రం పాండురంగ, గోశిక ప్రభాకర్, గోషిక రవి, రాపోలు రాజశేఖర్, నోముల మాధవరెడ్డి, గుజ్జరి శ్రవణ్ కుమార్, గంజి దేవదాస్,కర్నాటి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

11వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News