Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:25 PM

10వ వార్డులో ఇంటింటి ప్రచారం జోరు

10వ వార్డులో ఇంటింటి ప్రచారం జోరు

10వ వార్డులో ఇంటింటి ప్రచారం జోరు
05-02-2026 307 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కారు గుర్తుకు ఓటు వేసి సదాశివ రెడ్డిని గెలిపించాలి

సూర్యాపేట:

సూర్యాపేట పట్టణంలోని పదవ వార్డు పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారం చేపట్టి, సదాశివ రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట మాజీ జిల్లా పరిషత్ సభ్యుడు జీడి భిక్షం పాల్గొని గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. గతంలో కారు గుర్తు ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వార్డు అభివృద్ధికి సదాశివ రెడ్డి సరైన నాయకుడని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే వ్యక్తిత్వం ఆయనదని తెలిపారు.గ్రామంలో తాగునీటి సమస్యలు, రహదారులు, పారిశుధ్యం, కాలనీల అభివృద్ధి, పేదల సంక్షేమం వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపై హామీ ఇచ్చారు. ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉండే నాయకత్వం అవసరమని, అలాంటి నాయకత్వాన్ని సదాశివ రెడ్డి అందిస్తారని జీడి భిక్షం పేర్కొన్నారు.పిల్లలమర్రి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కారు గుర్తు పనిచేస్తుందని, గత అనుభవం, ప్రజలపై అవగాహన ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి సదాశివ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.ఈ ఇంటింటి ప్రచారానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, గ్రామంలో ఎన్నికల వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.

Sthanikam

10వ వార్డులో ఇంటింటి ప్రచారం జోరు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News