Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:15 PM

06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి వేముల వీరేశం పిలుపు

08-02-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాలలో అభివృద్ధి హామీలతో కాంగ్రెస్ ప్రచారం

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 06వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జెర్రీపోతుల సత్యనారాయణను చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజలను కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చిట్యాల మున్సిపాలిటీలో అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం పాలైందని విమర్శించారు. మౌలిక సదుపాయాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.06వ వార్డులో ఉన్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ, ప్రజల ఆశీర్వాదంతో చిట్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.

Sthanikam

06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి వేముల వీరేశం పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News