Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:19 AM

యూరియా బస్తాపై రూ.30 అదనపు వసూలు?

యూరియా బస్తాపై రూ.30 అదనపు వసూలు?

యూరియా బస్తాపై రూ.30 అదనపు వసూలు?
19-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో డీలర్ల దందాపై రైతుల ఆగ్రహం

ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ)కు విరుద్ధంగా యూరియా బస్తాలపై అదనపు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పలువురు ఎరువుల డీలర్లు ఒక్కో యూరియా బస్తాపై రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

అదనపు మొత్తంపై ప్రశ్నిస్తే రవాణా, హమాలీ చార్జీలు పేరుతో డబ్బులు తీసుకుంటున్నారని వారు చెబుతున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ఇవ్వకపోతే యూరియా అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ విక్రయ వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ ఈ విధమైన వసూళ్లు కొనసాగడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాగు సీజన్‌లో ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమపై ఇది అదనపు భారం అవుతోందని వాపోతున్నారు.

ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యూరియాను కేవలం ఎంఆర్పీ ధరకే విక్రయించేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Sthanikam

యూరియా బస్తాపై రూ.30 అదనపు వసూలు?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News