Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:23 AM

యాప్ విధానం రద్దు చేసి సహకార సంఘాల ద్వారానే సరఫరా చేయాలి: సిపిఐ నేత ఎర్ర రమేష్ గౌడ్

21-02-2026 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో కల్తీ యూరియాపై ఆగ్రహం

రామన్నపేటలో ప్రైవేట్ ఏజెన్సీ షాపులలో కల్తీ యూరియా అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలనే నిబంధన విధించడం వల్ల రైతులకు ఎరువు సకాలంలో అందడం లేదని సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్ విమర్శించారు.

యాప్‌లో బుక్ చేసిన యూరియాను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా తీసుకోవాల్సి రావడంతో, అక్కడ ఏ రకమైన యూరియా అమ్ముతున్నారో రైతులకు స్పష్టత లేకపోతోందని తెలిపారు. పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో ఆలస్యం కావడంతో, ఎక్కడ దొరికితే అక్కడ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, యాప్ విధానాన్ని పునర్విమర్శించి, యూరియాను వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే నేరుగా రైతులకు అందించాలని ఎర్ర రమేష్ డిమాండ్ చేశారు. అలాగే యూరియా సరఫరా చేసే ప్రైవేట్ ఏజెన్సీలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి, కల్తీ ఎరువుల అమ్మకాలను కట్టడి చేయాలని కోరారు.

Sthanikam

యాప్ విధానం రద్దు చేసి సహకార సంఘాల ద్వారానే సరఫరా చేయాలి: సిపిఐ నేత ఎర్ర రమేష్ గౌడ్

Article Image

రామన్నపేటలో కల్తీ యూరియాపై ఆగ్రహం

రామన్నపేటలో ప్రైవేట్ ఏజెన్సీ షాపులలో కల్తీ యూరియా అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలనే నిబంధన విధించడం వల్ల రైతులకు ఎరువు సకాలంలో అందడం లేదని సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్ విమర్శించారు.

యాప్‌లో బుక్ చేసిన యూరియాను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా తీసుకోవాల్సి రావడంతో, అక్కడ ఏ రకమైన యూరియా అమ్ముతున్నారో రైతులకు స్పష్టత లేకపోతోందని తెలిపారు. పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో ఆలస్యం కావడంతో, ఎక్కడ దొరికితే అక్కడ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, యాప్ విధానాన్ని పునర్విమర్శించి, యూరియాను వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే నేరుగా రైతులకు అందించాలని ఎర్ర రమేష్ డిమాండ్ చేశారు. అలాగే యూరియా సరఫరా చేసే ప్రైవేట్ ఏజెన్సీలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి, కల్తీ ఎరువుల అమ్మకాలను కట్టడి చేయాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News