Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాల మూసివేత.

08-02-2026 182 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ సమయంలో శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించేందుకు మద్యం దుకాణాల మూసివేతకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ పూర్తయ్యే వరకు భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు మున్సిపాలిటీల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయనున్నారు.అదేవిధంగా ఫిబ్రవరి 13వ తేదీ ఎన్నికల ఫలితాల రోజు, కౌంటింగ్ పూర్తయ్యే వరకు భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం. విష్ణుమూర్తి హెచ్చరించారు. ఎన్నికల ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

Sthanikam

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాల మూసివేత.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News