Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

యాదాద్రి భువనగిరి జిల్లాకు కొత్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి నియామకం

26-02-2026 256 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించారు.

ఇంతకుముందు ఆయన భోధన్, ఖమ్మం జిల్లాల్లో సబ్ కలెక్టర్‌గా పనిచేసి పరిపాలనలో అనుభవాన్ని సంపాదించారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు.

తదుపరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా పనిచేసిన ఆయన, ప్రస్తుతం రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తుండగా బదిలీపై యాదాద్రి భువనగిరి జిల్లాకు నియమితులయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమగ్ర అభివృద్ధి దిశగా జిల్లా ముందుకు సాగేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

యాదాద్రి భువనగిరి జిల్లాకు కొత్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి నియామకం

Article Image

2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించారు.

ఇంతకుముందు ఆయన భోధన్, ఖమ్మం జిల్లాల్లో సబ్ కలెక్టర్‌గా పనిచేసి పరిపాలనలో అనుభవాన్ని సంపాదించారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు.

తదుపరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా పనిచేసిన ఆయన, ప్రస్తుతం రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తుండగా బదిలీపై యాదాద్రి భువనగిరి జిల్లాకు నియమితులయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమగ్ర అభివృద్ధి దిశగా జిల్లా ముందుకు సాగేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News