Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుల వివక్ష ఆరోపణలతో చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:41 PM

వికలాంగులకు రూ.6000 పెన్షన్ హామీ అమలు చేయాలి

వికలాంగులకు రూ.6000 పెన్షన్ హామీ అమలు చేయాలి

వికలాంగులకు రూ.6000 పెన్షన్ హామీ అమలు చేయాలి
February 21, 2026 04:25 PM 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రిజర్వేషన్లు కల్పించాలి – బడ్జెట్‌లో 5% నిధులు కేటాయించాలి

ఎన్‌పి ఆర్ డి 16వ ఆవిర్భావ దినోత్సవంలో వక్తల డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన రూ.6000 పెన్షన్ హామీని తక్షణమే అమలు చేయాలని, స్థానిక సంస్థలు మరియు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఎన్‌పి ఆర్ డి నాయకులు డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

సంఘం కార్యాలయం వద్ద నిర్వహించిన ఎన్‌పి ఆర్ డి 16వ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్ జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2010 ఫిబ్రవరి 21-22 తేదీలలో Kolkata నగరంలో ఎన్‌పి ఆర్ డి స్థాపించబడిందని తెలిపారు. “జాలి కాదు – మా హక్కులు మాకు కావాలి” అన్న నినాదంతో దేశవ్యాప్తంగా వికలాంగులను ఐక్యం చేస్తూ హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

2016 వికలాంగుల హక్కుల చట్టం సాధన, అంత్యోదయ రేషన్ కార్డులు, రైల్వే సౌకర్యాల విస్తరణ, ప్రజా ప్రదేశాలను అవరోధ రహితంగా మార్చడం వంటి అంశాల్లో సంఘం కృషి ఫలితంగా పురోగతి సాధించిందన్నారు. మహిళా వికలాంగుల హక్కుల పరిరక్షణలో కూడా సంఘం ముందుండి పోరాటాలు నిర్వహించిందని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యాయని విమర్శించారు. బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమానికి కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేట్ రంగంలో 5 శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సురుపంగా ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లేపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News