Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:32 PM

వికలాంగుల హక్కులపై కేంద్ర బడ్జెట్ దాడి

వికలాంగుల హక్కులపై కేంద్ర బడ్జెట్ దాడి

వికలాంగుల హక్కులపై కేంద్ర బడ్జెట్ దాడి
02-02-2026 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

0.0286 శాతం కేటాయింపులతో అభివృద్ధి మోసమే

భువనగిరిలో బడ్జెట్ ప్రతుల దహనం

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వికలాంగుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఫిబ్రవరి 2న బడ్జెట్ ప్రతులను దహనం చేస్తూ… ఈ బడ్జెట్ వికలాంగుల హక్కులను కాలరాస్తోందని, అసమానతలను మరింత పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జాతీయ వికలాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు సురూపంగా ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ… వికలాంగుల హక్కుల చట్టం–2016ను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. సమానత్వం, వివక్షతలేని జీవితం, సంపూర్ణ భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం తప్పించుకుంటోందని విమర్శించారు.దేశ బడ్జెట్‌లో వికలాంగుల కోసం కేటాయించిన నిధులు కేవలం 0.0286 శాతం మాత్రమే ఉండటం ఘోర అన్యాయమని తెలిపారు. ఇంత స్వల్ప నిధులతో వికలాంగుల అభివృద్ధి సాధ్యమా? అని ప్రశ్నించారు. వికలాంగుల సాధికారత శాఖకు కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు.

నైపుణ్యాభివృద్ధి పేరుతో ప్రవేశపెట్టిన పథకాలు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యాయని తెలిపారు. శిక్షణ కేంద్రాలకు నిధులు వెళ్తున్నాయే తప్ప వికలాంగులకు ఉద్యోగాలు రావడం లేదని అన్నారు.

విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం రంగాల్లో నిధుల కోతలు వికలాంగుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. పాఠశాలలు అందుబాటులో లేకపోవడం, వైద్య సేవలు భరించలేనివిగా మారడం, ఆహార భద్రత క్షీణించడం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు.ఇందిరా గాంధీ వికలాంగుల పెన్షన్‌ను 2012 నుంచి నెలకు 300 రూపాయలకే పరిమితం చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. జీవన వ్యయాలు పెరిగినా పెన్షన్ పెంపు చేయకపోవడం అమానుషమని అన్నారు.కార్పొరేట్లకు రాయితీలు, సంపన్నులకు లాభాలు ఇస్తూ… వికలాంగుల సంక్షేమంపై ఖర్చులను కుదించడం సామాజిక న్యాయానికి విరుద్ధమని తెలిపారు. వికలాంగుల కోసం కేంద్ర బడ్జెట్‌లో ఐదు శాతం నిధులు కేటాయించాలని, ఖర్చు కోతల విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ వికలాంగుల హక్కుల వేదిక జిల్లా వర్కింగ్ అధ్యక్షులు బొల్లేపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, గోపి శ్రీహరి, అంజన్, శ్రీ మధు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల హక్కులపై కేంద్ర బడ్జెట్ దాడి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News