Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:20 PM

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.డాక్టర్ అజయ్ కుమార్

05-02-2026 246 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గైర్హాజరైన ముగ్గురు వైద్యులకు షోకాజ్ నోటీసులు

వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ హెచ్చరిక

రామన్నపేట, ఫిబ్రవరి 5:

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వైద్యులపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ హెచ్చరించారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలోని ఓపీ విభాగం, వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాజరు రిజిస్టర్లను పరిశీలించిన కమిషనర్, అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైన ముగ్గురు వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.వైద్యులతో సమావేశమై ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగులకు అందిస్తున్న మందులపై ఆరా తీసి, ఔషధ నిల్వలను పరిశీలించారు. అత్యవసర మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు కమిషనర్‌ను కలిసి ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకుందని, నూతన భవనాన్ని మంజూరు చేయాలని, ఆసుపత్రి స్థాయిని వంద పడకలకు పెంచాలని కోరారు. వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం ప్రస్తుతం పరిశీలన దశలో ఉందని డాక్టర్ అజయ్ కుమార్ వారికి తెలిపారు.ఈ తనిఖీల్లో డీసీహెచ్ఎస్ చిన్నా నాయక్, వైద్యులు స్వాతి బాయి, నవీన్ సింగ్, మాధవచారి, దేవేందర్, సుమంగళి, హెడ్ నర్సులు సువర్ణ, సోలి, జ్యోతి, నర్సింగ్ మరియు పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.డాక్టర్ అజయ్ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News