Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 10:49 AM

వెల్లంకిలో సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభం ప్రజా సమస్యలపై ఐక్య పోరాటం అవసరం.ఎం.డి అబ్బాస్

23-02-2026 205 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు వెల్లంకి గ్రామంలో ప్రారంభమయ్యాయి. స్థానిక రఘురామ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రారంభంగా పార్టీ సీనియర్ నాయకులు పతాకావిష్కరణ చేసి అమరవీరులకు నివాళులర్పించారు.

శిక్షణ తరగతులకు బోధకుడిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి అబ్బాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ, జాతీయ పరిణామాలపై కార్యకర్తలు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. దేశ ఆర్థిక, సామాజిక విధానాలపై చర్చిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రజాస్వామ్య, లౌకిక విలువలను కాపాడేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

మరో సెషన్‌లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ “కులం, మతం – అస్తిత్వవాదం మరియు పరిష్కార మార్గాలు” అనే అంశంపై మాట్లాడారు. సమాజంలో కుల, మత విభేదాలు కొనసాగుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ దోషులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు మేక అశోక్ రెడ్డి,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం,జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్,బల్గూరి అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహ చారి, బోయిని ఆనంద్, జంపాల అండాలు, కందుల హనుమంతు, కల్లూరి నగేష్,గ్రామ శాఖ కార్యదర్శి ఆవనగంటి నగేష్, గన్నేబోయిన విజయ భాస్కర్, బావండ్లపల్లి బాలరాజు, బోడిగే రజిత, గొరిగే సోములు, వేముల సైదులు, తొలుపునూరి శ్రీనివాస్, ఎండీ రషీద్, వెల్లంకి గ్రామ నాయకులు కర్రె సంతోష్, ఆవనగంటి స్వామి,బర్ల బాబురావు,ఎర్రోళ్ళ నర్సింహా, తాటిపాముల సంతోష,తాటిపాముల మహేష్,కన్నెబోయిన రాజలింగం, తాటిపాముల వనిత, ఆవనగంటి వెంకటమ్మ, తాటిపాముల నవీన్, కరకంటి మల్లయ్య, పున్న దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

వెల్లంకిలో సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభం ప్రజా సమస్యలపై ఐక్య పోరాటం అవసరం.ఎం.డి అబ్బాస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News