Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్లు… ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు

21-02-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లు పూర్తి దశకు చేరుకున్నాయి. విద్యార్థులకు సౌలభ్యం కల్పించేందుకు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ ద్వారా కూడా పొందే విధంగా ఇంటర్మీడియెట్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం, కళాశాల ముద్ర అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ హాల్‌టికెట్‌తోనే విద్యార్థులు నేరుగా పరీక్ష కేంద్రాలకు హాజరుకావచ్చని అధికారులు తెలిపారు.

గుంటూరు జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 87 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 68,941 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

విద్యార్థులు హాల్‌టికెట్‌ను పొందిన వెంటనే తమ వ్యక్తిగత వివరాలు, సబ్జెక్టులు, పరీక్షల షెడ్యూల్‌ను తప్పనిసరిగా సరిచూసుకోవాలని సూచించారు. హాల్‌టికెట్‌పై పేర్కొన్న పరీక్ష కేంద్రాన్ని ముందుగానే స్వయంగా వెళ్లి చూసి రావడం మంచిదని, తద్వారా పరీక్ష రోజున రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడాలని అధికారులు తెలిపారు.

అలాగే పరీక్ష సమయానికి కనీసం అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. పరీక్షలను ప్రశాంతంగా, సమయపాలనతో నిర్వహించేందుకు విద్యార్థులు నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్లు… ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News