Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:17 PM

వనస్థలిపురం డివిజన్ మౌలిక సదుపాయాలపై జోనల్ కమిషనర్‌కు వినతి

05-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి జోనల్ కమిషనర్ హేమంత్ పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్‌తో పాటు అభ్యుదయ నగర్ కాలనీ అధ్యక్షుడు గంగి రెడ్డి, క్రిస్టిన్ కాలనీ అధ్యక్షుడు హరిందర్ రెడ్డి, ప్రశాంత్ నగర్ కాలనీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వనస్థలిపురం డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను కార్పొరేటర్ జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రహదారులు అధ్వానంగా మారడం, డ్రైనేజీ సరిగా పనిచేయక వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయడం, పాడైపోయిన రహదారుల మరమ్మతులు చేపట్టడం అత్యవసరమని కోరారు. ప్రజలకు సంబంధించిన ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ అంశాలపై జోనల్ కమిషనర్ హేమంత్ పటేల్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరలోనే సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Sthanikam

వనస్థలిపురం డివిజన్ మౌలిక సదుపాయాలపై జోనల్ కమిషనర్‌కు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News