Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:40 AM

విషాద వేళ అండగా నిలిచిన గురువు.. అశోక్ కుటుంబానికి ధైర్యం చెప్పిన డేవిడ్ కడియం

20-12-2025 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డాక్టర్ ఎన్ అశోక్ తల్లిదండ్రులకు నివాళులర్పించిన గురువర్యులు డేవిడ్ కడియం

స్థానిక ప్రతినిధి మల్లేశం గౌడ్
ఇటీవలే తన తల్లి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న డాక్టర్ ఎన్ అశోక్ కుటుంబాన్ని గురువర్యులు డేవిడ్ కడియం దంపతులు పరామర్శించారు. అనివార్య కారణాల వల్ల దశదిన కర్మకు హాజరు కాలేకపోయిన నేపథ్యంలో, ఈ రోజు డేవిడ్ కడియం–విజయ ఎలిజబెత్ దంపతులు అశోక్ నివాసానికి చేరుకుని ఆయన తల్లిదండ్రుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ అశోక్‌ను ఆప్యాయంగా పరామర్శించిన డేవిడ్ కడియం, తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబానికి మనోధైర్యం నింపారు. ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొని రానున్న రోజుల్లో మరింత బలంగా ముందుకు సాగాలని సూచించారు. అవసరమైన ప్రతి సందర్భంలో తామూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
గురువర్యులు ఎప్పటికప్పుడు తమకు ధైర్యం చెప్పి, మార్గనిర్దేశం చేస్తూ సొంత కుటుంబ సభ్యుల్లా అండగా నిలుస్తున్నారని డాక్టర్ అశోక్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన చూపించిన బాటలో నడవడం తమకు గర్వకారణమని, ఆయన ఆశీస్సులు తమ జీవితానికి దిశానిర్దేశమని ఈ సందర్భంగా భావోద్వేగంగా వెల్లడించారు
Sthanikam

విషాద వేళ అండగా నిలిచిన గురువు.. అశోక్ కుటుంబానికి ధైర్యం చెప్పిన డేవిడ్ కడియం

Article Image

డాక్టర్ ఎన్ అశోక్ తల్లిదండ్రులకు నివాళులర్పించిన గురువర్యులు డేవిడ్ కడియం

స్థానిక ప్రతినిధి మల్లేశం గౌడ్
ఇటీవలే తన తల్లి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న డాక్టర్ ఎన్ అశోక్ కుటుంబాన్ని గురువర్యులు డేవిడ్ కడియం దంపతులు పరామర్శించారు. అనివార్య కారణాల వల్ల దశదిన కర్మకు హాజరు కాలేకపోయిన నేపథ్యంలో, ఈ రోజు డేవిడ్ కడియం–విజయ ఎలిజబెత్ దంపతులు అశోక్ నివాసానికి చేరుకుని ఆయన తల్లిదండ్రుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ అశోక్‌ను ఆప్యాయంగా పరామర్శించిన డేవిడ్ కడియం, తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబానికి మనోధైర్యం నింపారు. ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొని రానున్న రోజుల్లో మరింత బలంగా ముందుకు సాగాలని సూచించారు. అవసరమైన ప్రతి సందర్భంలో తామూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
గురువర్యులు ఎప్పటికప్పుడు తమకు ధైర్యం చెప్పి, మార్గనిర్దేశం చేస్తూ సొంత కుటుంబ సభ్యుల్లా అండగా నిలుస్తున్నారని డాక్టర్ అశోక్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన చూపించిన బాటలో నడవడం తమకు గర్వకారణమని, ఆయన ఆశీస్సులు తమ జీవితానికి దిశానిర్దేశమని ఈ సందర్భంగా భావోద్వేగంగా వెల్లడించారు
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News