Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 03:13 PM

విశాఖపట్నంలో CITU జాతీయ మహాసభలు – రామన్నపేట నాయకులు

06-01-2026 321 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విశాఖపట్నం సానిక ప్రతినిధి

విశాఖపట్నంలో నిర్వహించిన సీఐటీయూ జాతీయ మహాసభల సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభ కార్మిక ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రతినిధులు హాజరైన ఈ సభలో తెలంగాణ నుంచి రామన్నపేట మండలానికి చెందిన నాయకులు విశేషంగా పాల్గొని ప్రత్యేక గుర్తింపు పొందారు.ఈ మహాసభల్లో రామన్నపేట మండలానికి చెందిన కల్లూరి మల్లేశం గారు నూతనంగా సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక కావడం విశేషంగా నిలిచింది. ఇది మండల కార్మిక ఉద్యమానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గొరిగే సోములు, సీఐటీయూ మండల నాయకులు మునికుంట్ల లెనిన్, గొరిగె ధనుష్ తదితరులు ఈ బహిరంగ సభలో పాల్గొని కార్మిక హక్కుల పరిరక్షణకు తమ సంఘీభావాన్ని చాటారు.

కార్మికుల జీవన భద్రత, కనీస వేతనాల అమలు, సామాజిక భద్రతా పథకాలపై కేంద్రం తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ మహాసభలు స్పష్టమైన సందేశం ఇచ్చాయని నాయకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కార్మికుల సమస్యలపై మరింత ఉధృతంగా పోరాటాలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.

Sthanikam

విశాఖపట్నంలో CITU జాతీయ మహాసభలు – రామన్నపేట నాయకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News