Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:44 PM

*ఉపాధి హామీపై కేంద్రీకృత దాడి గ్రామీణ పేదలు తిరగబడాలి: జల్లెల పెంటయ్య

02-02-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలకు ఉపాధిని దూరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై గ్రామీణ ప్రజలు పోరుబాట పట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా కూల్చే ప్రయత్నాలకు కార్మికులు, రైతులు ఏకమవాలని స్పష్టం చేశారు.వ్యవసాయ కార్మిక సంఘం–సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్–జి–రామ్–జి చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జల్లెల పెంటయ్య మాట్లాడుతూ వామపక్ష పార్టీల దీర్ఘకాల పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం, రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపడం ద్వారా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రాల వాటాను పెంచడం వల్ల ఉపాధి కూలీలకు చేసిన పనికి సకాలంలో వేతనాలు అందక జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న కూలీలపై మరో భారం మోపుతూ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ధ్వంసం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని హెచ్చరించారు.తదనంతరం కొమ్మాయిగూడెం గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి నిరసన చేపట్టారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉపాధి హామీ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు, మాజీ వైస్ ఎంపిపి నాగటి ఉపేందర్, మండల కమిటీ సభ్యులు భావండ్లపల్లి బాలరాజు, శానకొండ వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి జితేందర్, గోగు లింగస్వామి, నాగు నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

*ఉపాధి హామీపై కేంద్రీకృత దాడి గ్రామీణ పేదలు తిరగబడాలి: జల్లెల పెంటయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News