Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:59 AM

ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి వ్యతిరేకంగా మార్చి 2న మహాధర్నా

20-02-2026 135 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపాధి కూలీల సమస్యలపై పోరాటానికి పిలుపు

రామన్నపేట, : ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను గ్రామీణ పేదలు తిప్పికొట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి.రామ్ జి బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మార్చి 2న రామన్నపేట ఎంపీడీవో కార్యాలయం ముందు నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ జనంపల్లి, కక్కిరేణి, ఇస్కిళ్ళ, దుబ్బాక గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చే ప్రయత్నం సరికాదన్నారు. నూతన విధానం అమల్లోకి వస్తే గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని, కేంద్రం తన 90 శాతం వాటాను 60 శాతానికి తగ్గించుకోవడం ద్వారా బాధ్యత నుంచి తప్పుకుంటోందని విమర్శించారు.

చేసిన పనికి నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండటం, కనీస వేతనం అందకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు కనీసం రూ.600 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పాత విధానంలోనే చట్టాన్ని కొనసాగించి గ్రామీణ పేదలకు ఉపాధిని హామీ చేయాలని కోరారు.

మార్చి 2న జరిగే మహాధర్నాకు మండలంలోని వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, కందుల హనుమంతు, దుబ్బాక సర్పంచ్ గట్టు నరసింహ, గన్నేబోయిన విజయభాస్కర్, వేముల సైదులు, పులి బిక్షమయ్య, గుండాల ప్రసాద్, గుండాల నరేష్, కన్నెబోయిన యాదయ్య, గట్టు గోపయ్య, పుట్టల ఉదయ్ కుమార్, కంబాలపల్లి మత్స్యగిరి, గట్టు రాజ్ కుమార్, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి వ్యతిరేకంగా మార్చి 2న మహాధర్నా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News