Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:03 PM

ఉపాధి హామీ చట్టాన్ని 'తల లేని మొండెం'గా మారుస్తున్న కేంద్రం

ఉపాధి హామీ చట్టాన్ని 'తల లేని మొండెం'గా మారుస్తున్న కేంద్రం

ఉపాధి హామీ చట్టాన్ని 'తల లేని మొండెం'గా మారుస్తున్న కేంద్రం
December 26, 2025 10:00 AM 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొత్త బిల్లుతో పేదల పొట్ట కొడుతున్న మోదీ సర్కార్: బి. వెంకట్ ధ్వజం

యంత్రాలు, కాంట్రాక్టర్ల కోసమే కొత్త చట్టం.. పాత చట్టాన్నే కొనసాగించాలని డిమాండ్


నల్లగొండ, (స్థానికం):

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను రద్దు చేసి, దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన బిల్లు-2025 పేదలకు ఉరితాడులా మారుతుందని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

గాంధీ పేరును తుడిచేసే కుట్ర:

ఈ సందర్భంగా బి. వెంకట్ మాట్లాడుతూ.. "గాంధీని చంపిన గాడ్సే వారసులే, ఇప్పుడు గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని చంపేందుకు సిద్ధమయ్యారు," అని ఘాటుగా విమర్శించారు. వికసిత్ భారత్-2047లో భాగంగా అంటూ కేంద్రం తెస్తున్న 'గ్యారంటీ రోజగార్ (Vb-GRAM G 2025)' బిల్లు, ఉపాధి హామీ చట్టాన్ని తల లేని మొండెంలా మారుస్తుందని ఎద్దేవా చేశారు.

కొత్త బిల్లుతో ముప్పు:

ఉపాధి హామీని నిర్వీర్యం చేసేలా కేంద్రం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు:

పని దినాల కోత:

పని దినాలను 125 రోజులకు పెంచుతామని చెబుతూనే, వ్యవసాయ సీజన్ పేరుతో 60 రోజుల పాటు పనులను నిషేధించడం దారుణమన్నారు.

రాష్ట్రాలపై భారం:

ఇప్పటివరకు 90:10 నిష్పత్తిలో ఉన్న కేంద్ర, రాష్ట్రాల నిధుల వాటాను.. ఇప్పుడు 60:40కి మారుస్తూ రాష్ట్రాలపై భారం మోపుతున్నారని, తద్వారా చట్టాన్ని మెల్లగా ఎత్తివేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.

టెక్నాలజీ పేరుతో గందరగోళం:

సోషల్ ఆడిట్ స్థానంలో టెక్నాలజీ, బయోమెట్రిక్, AI, GPS విధానాలను ప్రవేశపెట్టి పేద కూలీలను పనుల నుంచి దూరం చేస్తున్నారని విమర్శించారు.

యంత్రాలకే పెద్దపీట:

పనులను నాలుగు రకాలుగా విభజించి, యంత్రాలకు మరియు కాంట్రాక్టర్లకు ఉపాధి కల్పిస్తున్నారని, ఇది పేదల పొట్ట కొట్టడమేనని అన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు భూముల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణం వంటి ఉపయోగాలు లేకుండా చేస్తున్న ఈ కొత్త బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని, 2005 నాటి చట్టాన్నే యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

పాల్గొన్నవారు:

ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నారీ ఐలయ్య, భువనగిరి జిల్లా కార్యదర్శి కొండమడుగు నరసింహ, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు, మహిళా కన్వీనర్ దండెంపల్లి సరోజ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News