Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

ఉద్యాన యాంత్రిక పరికరాలకు భారీ సబ్సిడీ'

ఉద్యాన యాంత్రిక పరికరాలకు భారీ సబ్సిడీ'

ఉద్యాన యాంత్రిక పరికరాలకు భారీ సబ్సిడీ'
07-02-2026 166 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నలభై నుంచి యాభై శాతం రాయితీపై రైతులకు సరఫరా

యాదాద్రి భువనగిరి:

ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సమగ్ర ఉద్యానాభివృద్ధి మిషన్ పథకం కింద ఉద్యాన యాంత్రికరణ విభాగంలో రైతులకు పలు వ్యవసాయ పరికరాలను నలభై నుంచి యాభై శాతం సబ్సిడీపై అందించనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యం పరిమితంగా ఉండటంతో ముందుగా దరఖాస్తు చేసిన రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ పథకం కింద రైతులకు పవర్ టిల్లర్లు, పవర్ వీడర్లు, బ్రష్ కట్టర్లు, పవర్ స్ప్రేయర్లు, మిని ట్రాక్టర్లు అందుబాటులో ఉంచారు. వర్గాల వారీగా పరికరాల కేటాయింపు ఇలా ఉంది.

పవర్ టిల్లర్లు

ఎస్టీ వర్గానికి ఒకటి, ఐదు ఎకరాలకు మించిన భూమి కలిగిన ఇతర రైతులకు మూడు.

పవర్ వీడర్లు

చిన్న సన్నకారు రైతులకు ఒకటి, ఎస్సీ వర్గానికి రెండు, పెద్ద రైతులకు మూడు.

బ్రష్ కట్టర్లు

చిన్న సన్నకారు రైతులకు నాలుగు, ఎస్సీ వర్గానికి ఐదు, ఎస్టీ వర్గానికి నాలుగు, పెద్ద రైతులకు ఐదు.

పవర్ స్ప్రేయర్లు

చిన్న సన్నకారు రైతులకు రెండు, ఎస్సీ వర్గానికి నాలుగు, పెద్ద రైతులకు పన్నెండు.

మిని ట్రాక్టర్లు

చిన్న సన్నకారు రైతులకు ఒకటి, ఎస్సీ వర్గానికి ఒకటి, ఎస్టీ వర్గానికి ఒకటి, పెద్ద రైతులకు ఒకటి.

ఆసక్తి గల రైతులు ఫిబ్రవరి పదో తేదీలోపు సంబంధిత ఉద్యాన అధికారిని సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు.

సంప్రదించాల్సిన వివరాలు

చౌటుప్పల్, బొమ్మలరామారం, వలిగొండ, రామన్నపేట, నారాయణపూర్, పోచంపల్లి, అడ్డగుడూర్, మోత్కూర్ మండలాల రైతులు – 8977714175

ఆత్మకూర్, గుండాల, మోటకొండూరు, ఆలేరు, రాజాపేట, తుర్కపల్లి, బీబీనగర్ మండలాల రైతులు – 8977714176

భువనగిరి, యాదగిరిగుట్ట మండలాల రైతులు – 8977714191

అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి తెలిపారు.

Sthanikam

ఉద్యాన యాంత్రిక పరికరాలకు భారీ సబ్సిడీ'

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News