Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:28 PM

ఉచిత కంటి వైద్యం, అద్దాల పంపిణి అభినందనీయం: యంపిడిఓ ఆవుల రాములు

05-02-2026 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కంటిచూపుకు కొత్త వెలుగు

గ్రామీణ పేదలకు ఉచిత కంటి వైద్యం ఆదర్శనీయం

గ్రామీణ పేదల కంటిచూపును తిరిగి అందించే ఉచిత కంటి వైద్య సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని మండల అభివృద్ధి అధికారి ఆవుల రాములు పేర్కొన్నారు. మునిపంపుల మాజీ సర్పంచ్ దేవిరెడ్డి రామిరెడ్డి జ్ఞాపకార్థం, ఆయన కుమారుడు దేవిరెడ్డి వీరేందర్ రెడ్డి సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.గత అరవై రోజుల క్రితం నిర్వహించిన కంటి పరీక్షల్లో అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించి, ఆపరేషన్ పూర్తిచేసుకున్న వారికి భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం సమన్వయకర్త తలుపునూరి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆవుల రాములు మాట్లాడుతూ, సమస్య ఉన్నా వైద్యం చేయించుకునే స్థోమత లేక అనేక మంది గ్రామీణ పేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అన్న నినాదానికి నిదర్శనంగా సుమారు రెండు వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. అవగాహన లోపంతో వైద్య పరీక్షలకు కూడా దూరంగా ఉన్న ప్రజలకు ఇలాంటి సేవలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.గ్రామ అభివృద్ధికి దేవిరెడ్డి కుటుంబం గత కాలం నుంచి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవిరెడ్డి సావిత్రమ్మ, ఎంపీఓ రఫుల్ అలీ, గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, మాజీ సర్పంచ్ కట్ట యాదయ్య, పంచాయతీ కార్యదర్శి రచ్చ వేణు, అఖిల పక్ష నాయకులు, గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ఉచిత కంటి వైద్యం, అద్దాల పంపిణి అభినందనీయం: యంపిడిఓ ఆవుల రాములు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News