Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 04:12 PM

ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు వద్దు:సీఎం రేవంత్ రెడ్డి

13-01-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర స్థానిక వార్తలు:రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు శాఖను ఆదేశించారు. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వల్ల జరుగుతున్న ప్రమాదాలు, ప్రాణ నష్టాలపై ప్రభుత్వం తీవ్రంగా ఆందోళన చెందుతోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ చట్టాల అమలులో ఎలాంటి సడలింపులు ఉండకూడదని స్పష్టం చేశారు.ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి విధించే చలాన్లపై ఇకపై ఎలాంటి డిస్కౌంట్లు ఇవ్వబోమని సీఎం వెల్లడించారు. చలానా మొత్తాన్ని నేరుగా వాహన యజమానుల బ్యాంకు ఖాతాల నుంచి ఆటోమేటిక్‌గా కట్ అయ్యే విధంగా బ్యాంకింగ్ వ్యవస్థతో ట్రాఫిక్ విభాగాన్ని సింక్రనైజ్ చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా జరిమానాల వసూలు ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కఠిన సందేశం వెళ్లుతుందని ఆయన పేర్కొన్నారు.ట్రాఫిక్ విభాగాన్ని సాంకేతికంగా, మానవ వనరుల పరంగా మరింత బలోపేతం చేస్తామని సీఎం తెలిపారు. ఈ మొత్తం వ్యవస్థపై డీజీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆధునిక టెక్నాలజీ వినియోగంతో ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా చేయాలని అధికారులకు ఆదేశించారు.రోడ్డు భద్రతపై అవగాహన విద్యార్థి దశ నుంచే కల్పించాలని సీఎం సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని, పిల్లల తప్పిదాల వల్ల ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరూ బాధ్యతగా నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలను నివారించగలమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అమలు చేసి, రాష్ట్రాన్ని రోడ్డు ప్రమాద రహితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

Sthanikam

ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు వద్దు:సీఎం రేవంత్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News