Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:22 AM

తొలి దశలో క్యాన్సర్ గుర్తింపు.. HPV టీకా మహిళలకు జీవిత హామీ: డా. రాజేశ్వరి, వసంతకుమారి  

04-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

తొలి దశలో క్యాన్సర్ గుర్తింపు.. HPV టీకా మహిళలకు జీవిత హామీ: డా. రాజేశ్వరి, వసంతకుమారి 

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం NSS సెల్ ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఫిబ్రవరి 4, 2026న HPV అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. జీవన విధానంలో తగిన జాగ్రత్తలు, తొలి దశలో క్యాన్సర్ గుర్తింపు, నివారణ మార్గాలపై వక్తలు వివరంగా మాట్లాడారు. ముఖ్యంగా మహిళల గర్భాశయ క్యాన్సర్‌ను అరికట్టడానికి HPV టీకా ప్రాధాన్యతను హైలైట్ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రాజేశ్వరి PPT ప్రజెంటేషన్‌లో HPV వైరస్ (హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్) వల్ల మహిళలకు గర్భాశయ క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు తలెత్తవచ్చని వివరించారు. "ఈ రోజు మనం ఇక్కడ సమావేశమైనది ఎంతో ముఖ్యమైన HPV టీకా అవగాహన కార్యక్రమం కోసం. సరైన వయస్సులో టీకా తీసుకుంటే ఈ వ్యాధులను 90% వరకు నివారించవచ్చు" అని పేర్కొన్నారు. జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల తొలి దశలో క్యాన్సర్‌ను గుర్తించి చికిత్సించవచ్చని సూచించారు. మరొక ముఖ్య అతిథి డాక్టర్ వసంథకుమారి HPV టీకా ప్రాధాన్యత, ప్రయోజనాలు, దుష్ప్రభావాలు గురించి వివరించారు. 9-26 సంవత్సరాల మహిళలకు రెండు డోసులు తప్పనిసరి అని, ఉచితంగా అందుబాటులో ఉందని తెలిపారు. "మనం మాత్రమే కాక, మాకుటుంబ సభ్యులు, సమాజంలోని మహిళలకు ఈ అవగాహనను వ్యాప్తి చేయాలి. తొలి దశలో గుర్తింపు క్యాన్సర్‌ను 70% నివారించవచ్చు" అని గుర్తు చేశారు. ధూమపానం మానుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు కీలకమని సలహా ఇచ్చారు. కార్యక్రమంలో UGC BBM ప్రిన్సిపల్ ఆచార్య శ్రీదేవి, NSS కోఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి, టీచింగ్-నాన్ టీచింగ్ సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. NSS వాలంటీర్లు పోస్టర్లు, ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. మహిళల ఆరోగ్య రక్షణకు ఈ కార్యక్రమం మైలురాయిగా నిలిచింది. విశ్వవిద్యాలయం ఇలాంటి కార్యక్రమాలతో సమాజ సేవలో ముందంజలో నిలుస్తోంది.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News