Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:21 PM

తిరుమలలో చేసింది మహా పాపం - అదే వైసీపీకి అయింది పెద్ద శాపం - వాళ్ళు చేసిన పాపాన్ని ప్రజలు ఎన్నటికీ క్షమించరు మంత్రి పార్థసారధి

తిరుమలలో చేసింది మహా పాపం - అదే వైసీపీకి అయింది పెద్ద శాపం - వాళ్ళు చేసిన పాపాన్ని ప్రజలు ఎన్నటికీ క్షమించరు మంత్రి పార్థసారధి

తిరుమలలో చేసింది మహా పాపం - అదే వైసీపీకి అయింది పెద్ద శాపం - వాళ్ళు చేసిన పాపాన్ని ప్రజలు ఎన్నటికీ క్షమించరు మంత్రి పార్థసారధి
January 29, 2026 08:32 PM 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు జనవరి 29(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పవిత్రంగా భావించే స్వామివారి లడ్డు ప్రసాదంలో గత వైసీపీ ప్రభుత్వంలో కల్తీ నెయ్యి ఉపయోగించారనే అంశంపై షిట్ తమ చార్జి షీట్ నివేదికలో కల్తీ వాస్తవమే అంటూ ధృవీకరించిన నేపథ్యంలో మంత్రి కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో గురువారం నూజివీడు పట్టణంలో కూటమి నాయకులతో కలిసి "మహా పాపం - కల్తీ నిజం" అనే కార్యక్రమం పై భారీ ర్యాలీ నిర్వహించారు నగర పురవీధుల్లో నిర్వహించి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వరకు కూటమి నాయకులతో కలిసి మంత్రి ర్యాలీ నిర్వహిస్తూ అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో గత వైసిపి పాలకులు చేసిన అక్రమాలపై నిరసిస్తూ నినాదాలు తెలిపారు. అనంతరం వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పసుపు కుంకుమ నీళ్లతో మెట్లను ఆలయ ప్రాంగణాన్ని శుద్దిచేశారు.అనంతర ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ

ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో కల్తీ నెయ్యి ద్వారా లడ్డూలు తయారు చేసి ఘోర అపచారానికి పాల్పడ్డారు కాబట్టే ఆ శాపం తగిలి అధికారానికి దూరం అయ్యారని అన్నారు. ఈనాటికి వైసిపి దిగజారుడు రాజకీయాలు మానుకోకుండా, బకాయింపులతో వాస్తవాన్ని మరుగున పెట్టి సిగ్గు లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అదేవిధంగా పేర్ని నాని చేసే గాలి మాటలకు పాసి మాటలకు పసలేదని వాళ్ళు చేసిన తప్పులు ఏనాడు ఒప్పుకున్నారు కనుక వీటిని ఒప్పుకోవడానికి అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్, యువ నాయకులు మంత్రి నారా లోకేష్, ఆనాడే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పారన్నారు. వారి ఆధ్వర్యంలో కూటమీ ప్రభుత్వం , నిజాయితీగా నీతివంతమైన పాలనను ప్రజలకు అందిస్తుందని, గత పాలకులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తుందని తెలిపారు.

గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిరుపతిలో జరిగే కల్తీ లడ్డు వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేశాం. నాడు మేము చెప్పినట్లు గానే నేడు సుప్రీం కోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు నిగ్గు తేల్చిందన్నారు.నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆ కల్తీ నెయ్యితోనే స్వామివారికి ప్రసాదాలు తయారు చేశారని SIT దర్యాప్తు, ఛార్జ్ షీట్ ల ద్వారా బట్టబయలైంది. వైసీపీ నేతలు ఏం సమాధానం చెపుతారు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని మారండని అన్నారు.దేవదేవుడి ప్రసాదం విషయంలో జరిగిన ఈ మహా కల్తీ గుట్టు రట్టయిందని మేము ఏ తప్పూ చేయలేదు అని అన్న వైసీపీ నాయకుల ముఠా ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. కనీసం చుక్క పాలు లేకుండా పూర్తిగా రసాయనాలతో 'నెయ్యి' తయారు చేసి కోట్లాది లడ్డూలు సరఫరా చేశారు. ఇలాంటి అభూత 'ఇన్నోవేషన్' కు వైసీపీ ముఠాకు ప్రజలే బుద్ధి చెపుతారన్నాను. తల్లిపాలు కూడా కల్తీ చెయ్యగల దుర్మార్గులు వీరు.తప్పు లేదని చెప్పేవారు ఎందుకు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారు.కల్తీ నెయ్యి గురించి ఎవరు మాట్లాడకూడదని కోర్టు నుంచి ఎందుకు ఆదేశాలు తెచ్చుకున్నారు సమాధానం చెప్పండి అని ప్రశ్నించారు. ఆనాడు నిర్వాహకులు బ్యాంకు ఖాతాలో సుమారు.2 కోట్లు అక్రమ ముడుపులు అందాయి కాబట్టే వివరాలు ఇవ్వడానికి వెనుకాడుతున్నారన్నారు.

నెయ్యి కల్తీ చేయలేదు స్వామివారికి ద్రోహం చేయలేదు అని వై, సి, పి, నాయకులు ప్రమాణం చేయగలరా ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.వైసీపీ ఐదేళ్ళ పాలనలో మొత్తం 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయగా, అందులో 60 లక్షల కిలోలు కల్తీ నెయ్యితో 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారుచేశారు.. మహాపాపం చేశారు దేవుడు క్షమించండు తగిన మూల్యం చెల్లిస్తారన్నారు.

అప్పన్న బ్యాంకు ఖాతాల్లో 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్లలో రూ.4.69 కోట్లు జమ కాగా అందులో రూ.4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించాడు అది ఎవరి ఖాతాలోకి మళ్లించారు చెప్పగలరా అన్నారు.

ఏ మాత్రం అనుభవం లేని ఓ సామాన్య డెయిరీ సంస్థతో నకిలీ నెయ్యి సరఫరా చేసి కల్తీ నెయ్యి తో లడ్డూలు చేసి మహా పాపం చేసిన గత ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరన్నారు. అధికారులను బలి చేయటం వైసీపీ కి అలవాటే.అని అన్నారు.వైసీపీ గద్దెనెక్కి టీటీడీ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు, కల్తీకి రహదారి నిర్మించారు. తిరుమలను అక్రమాల పుట్టగా మార్చుకున్నారు.ఎలాంటి అనుభవం లేని డబ్బా కంపెనీలతో ఎటువంటి విచారణ జరపకుండా టెండర్లు కట్టబెట్టారు.

అర్హత లేకపోయినా భారీ ఎత్తున టెండర్ కట్టబెట్టి కల్తీ నెయ్యి తయారీకి పాల్పడ్డారన్నారు. ఈ కుంభకోణంలో రూ.235 కోట్ల స్వామివారి నిధుల దుర్వినియోగం చేసి తమ జేబులో వేసుకున్నారన్నారు.

వైసీపీ ప్రభుత్వం టెండర్లలో పాల్గొనే డెయిరీ పాలు సేకరించాల్సిన పనిలేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేదని, డెయిరీ మూడేళ్ల కార్యకలాపాలు చేయక్కర్లేదని, ఏడాది చాలని,నిబంధనలు సరలించి, రూ.250 కోట్ల టర్నోవర్ అవసరం లేదని, రూ.150 కోట్లు ఉంటే చాలని నిబంధనలు మార్చేసి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారన్నారు.ఐదేళ్లు హిందూమతంపై, హిందూ దేవుళ్లపై, పూజారులపై దాడులు చేసారు. అన్ని మతాలను గౌరవించాలని కానీ గత ప్రభుత్వం హిందూ మత సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి అవమానించిదని తెలిపారు.

చిన్న కేసు కదా అని పరకామణి కేసులో రూ. కోట్లు దొంగతనం చేసిన వాళ్లను వెనుకేసుకొచ్చి తప్పు చేశారు.బంగారం తాపడం అని ఏకంగా స్వామి వారికి బురిడీ తొడుగు తొడిగారని గుర్తుచేశారు.పట్టు లేకుండా నకిలీ పట్టు వస్త్రాలు సమర్పించి కోట్లు దోచుకున్న దొంగలు మీరని గుర్తుచేశారు.టీటీడీలో అన్యమతస్థుల నియామకం, బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం, తిరుమల కొండపై అన్యమత గుర్తు, అన్యమత బోధనలు, భక్తుడికి ప్రసాదాల ధరలు పెంచడం వంటి అనేక ఘటనలు గత ప్రభుత్వంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశాయి. కాబట్టే గత ప్రభుత్వ పాలనలో, భారతదేశ చరిత్రలో ఎక్కడా ఎన్నడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు, హిందూ మతంపై దాడులు జరిగాయి అని అన్నారు.వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేని గ్యాంగ్ ని తెచ్చి అందలం ఎక్కించి తిరుమల పవిత్రత మంటగొలిపారన్నారు. తిరుమలను అక్రమార్జనకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. రాజకీయ దుర్బుద్ధితో మత విశ్వాసాలను రెచ్చకొట్టారు.ఇప్పటికైనా కల్తీగాళ్ళు తప్పు తెలుసుకుని స్వామివారిని క్షమాపణ అడిగితే బాగుంటుందన్నారు. లేకపోతె వాళ్ళ పాపానికి నిష్కృతి లేదని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News