Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:49 PM

తిరుమల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యం

20-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

APSRTC & TGRTC బస్సుల్లోనే శీఘ్ర దర్శనం టికెట్లు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) సంయుక్తంగా ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. తిరుమలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం APSRTC & TGRTC బస్సుల్లో రోజుకు వెయ్యి శీఘ్ర దర్శనం టికెట్లను జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఏపీఎస్ఆర్టీసీ, టీజీ ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి ప్రయాణించే భక్తులు రూ.300 అదనంగా చెల్లించడం ద్వారా బస్సులోనే తిరుమల తిరుపతి దేవస్థానం శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చని పేర్కొన్నారు. ఈ సౌకర్యం ముఖ్యంగా లగ్జరీ, లహరి బస్సుల్లో ప్రయాణించే వారికి అందుబాటులో ఉంటుంది.ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు శీఘ్ర దర్శనం నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమల బస్టాండ్‌కు చేరుకున్న అనంతరం, అక్కడి ఏపీఎస్ఆర్టీసీ సూపర్‌వైజర్లు భక్తులకు దర్శన ప్రక్రియలో పూర్తిస్థాయి సహకారం అందిస్తారని వివరించారు.

ప్రస్తుతం APSRTC & TGRTC సంస్థలు తిరుపతికి రోజూ సుమారు 650 బస్సులను నడుపుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి డిపో నుంచీ తిరుపతికి బస్సు సౌకర్యం ఉండటంతో పాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి తదితర నగరాల నుంచి వచ్చే భక్తులకు ఈ విధానం ఎంతో సౌకర్యవంతంగా మారిందని అధికారులు తెలిపారు.కావున తిరుపతికి వెళ్లే భక్తులు ముందుగానే ఆర్టీసీ బస్సుల్లో దర్శనం టికెట్ పొందే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

Sthanikam

తిరుమల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News