తెలుగు భాషను బతికించుకోవాలి: సాహితీవేత్తలు ఆకాంక్ష
తెలుగు భాషను బతికించుకోవాలి: సాహితీవేత్తలు ఆకాంక్ష
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
తెలుగు భాషను బతికించుకోవాలి: సాహితీవేత్తలు ఆకాంక్ష
నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి : డి.డి. దాస్ సీనియర్ జర్నలిస్ట్
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు శాఖలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు మరియు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 'తెలుగు భాషా వికాసంలో వివిధ వైఖరులు' అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో సాహితీవేత్తలు తెలుగు భాషను బతికించుకోవాలని ఆకాంక్షించారు.గౌరవ అతిథిగా పాల్గొన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్ ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్లక్ష్యానికి గురవుతోందని, ప్రైవేటు విద్యావ్యవస్థ వల్ల తెలుగు మీడియం లేకుండా పోయిందని అన్నారు. మాతృభాషలో చదవడం ద్వారా నైతిక విలువలతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ఇకనైనా ప్రభుత్వాలు తెలుగు రక్షణకు పూనుకోవాలని కోరారు.ఆత్మీయ అతిథి ప్రముఖ చరిత్రకారుడు డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ భాష చాలా విశిష్టమైనదని, కేవలం ప్రామాణిక భాష రక్షణ వల్ల తెలుగు బతకదని, తెలంగాణ పదజాలాన్ని కాపాడితేనే తెలుగుకు ఉనికి ఉంటుందని చెప్పారు.విశిష్ట అతిథి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. కాశీం మాట్లాడుతూ, భాష భావజాలానికి వాహిక అని, మాట్లాడే భాష పుస్తక భాషగా మారాలని, మాట్లాడడం-రాయడం నైపుణ్యాలు ఉంటే యువతకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు సాహిత్యం అధ్యయనం చేయాలని సూచించారు.కీలకోపన్యాసం చేసిన ఆచార్య రెడ్డి శ్యామల మారుతున్న భాషను అందిపుచ్చుకొని కాపాడాలని, యుగాలుగా భాషా పరిణామాన్ని వివరించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యుడు డా. పి. విజయ కుమార్ తెలుగు మధురత్వాన్ని ప్రశంసిస్తూ రక్షణకు పిలుపునిచ్చారు.సాంకేతిక సదస్సుకు అధ్యక్షత వహించిన తెలంగాణ విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య కె. లావణ్య నిఘంటు-కోశ నిర్మాణం ద్వారా భాష బతుకుతుందని అన్నారు.సమాపనోత్సవంలో ముఖ్య అతిథి కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు తెలుగు ఉద్యోగ అవకాశాలు, ఆత్మగౌరవాన్ని కల్పిస్తుందని చెప్పారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు పాఠ్య ప్రణాళిక అధ్యక్షుడు డా. బెల్లి యాదయ్య పల్లె భాషను రక్షించుకోవాలని, పల్లె పదాలను పాడి వినిపించారు. ప్రముఖ కవి-విమర్శకుడు డా. పగడాల నాగేందర్ తెలంగాణ-ఆంధ్ర భాష వ్యత్యాసాలను ఉదాహరణలతో వివరించి సభను అలరించారు.సదస్సులో డా. ఎస్. రఘు, డా. తండు కృష్ణ కౌండిన్య, డా. దీపిక, డా. మామిడాల రమేష్ బాబు, డా. బకరం నర్సింహా, డా. ఎం. ఆనంద్, డా. నర్రా లవేందర్ రెడ్డి తదితరులు తెలుగు వైఖరులను వివరించారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగు శాఖ అధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్, వైస్ ప్రిన్సిపాల్స్ డా. రవి కుమార్, డా. అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రణ అధికారి డా. ముని స్వామి, విద్యాత్మిక సమన్వయకర్త బత్తిని నాగరాజు, డా. అనిల్ బొజ్జ, డా. ఎ. మల్లేశం, డా. అనిల్ అబ్రహం, డా. జ్యోత్స్న, డా. మహేశ్వరి, తెలుగు-హిందీ-ఉర్దూ అధ్యాపకులు, డిగ్రీ-పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్ సంఘం అధ్యక్షుడు డా. సంగి రమేష్ తెలుగు వెలగాలంటే ప్రతి తెలుగువాడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి