Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:18 PM

తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గందరగోళం

13-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Siddipet
Deshamkosam

స్థానికం ప్రతినిధి: దేశం కోసం

జనగాం జిల్లా రద్దు వార్తలు అవాస్తవం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం

తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. జనగాం జిల్లా రద్దు చేయబోతున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు. ప్రజలు ఇలాంటి నిర్ధారణ లేని వార్తలను నమ్మవద్దని సూచించారు.

ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియా వేదికగా జనగాం జిల్లాను ఇతర జిల్లాల్లో విలీనం చేయనున్నారని, జిల్లా హోదా తొలగించబడుతుందన్న రూమర్లు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగాం జిల్లా కొనసాగుతుందనీ, దాన్ని రద్దు చేసే అంశంపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశారు.

జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి పరిపాలన, అభివృద్ధి పనులు క్రమంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నాయని, అధికారిక ప్రకటనలు వెలువడినప్పుడే నమ్మాలని ఆయన అన్నారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా జిల్లాల రద్దు లేదా మార్పులపై ఎలాంటి అధికారిక నిర్ణయం లేదని వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జనగాం జిల్లా యథాతథంగా కొనసాగుతుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

Sthanikam

తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గందరగోళం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News