Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:35 AM

త్వరలో తెలంగాణలో 5 కొత్త పథకాలు – రేవంత్ సర్కార్

03-04-2026 186 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, దివ్యాంగుల సాధికారత లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

1). ముఖ్యంగా సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించి, పోషకాహారం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.

2). మరోవైపు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా పేద కుటుంబాలకు భరోసా కల్పించనున్నారు. ఆకస్మిక ఘటనల సమయంలో ఆర్థిక సహాయం అందేలా ఈ పథకం రూపొందుతోంది.

3. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్న భోజన పథకం విస్తరణ చేపట్టనున్నారు. మరింత పోషకాహారం అందించేలా మెనూ మార్పులు ఉండనున్నాయి.

4). దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మోటారైజ్డ్ వాహనాల పంపిణీ చేపట్టి, వారి విద్యాభ్యాసం సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

5). రైతుల సంక్షేమం కోసం పంటల విభిన్నీకరణ ప్రోత్సాహం పై దృష్టి సారించింది. ఒకే పంటపై ఆధారపడకుండా ఇతర పంటలు సాగు చేసే రైతులకు రూ.10 వేల వరకు ప్రోత్సాహకం ఇవ్వాలని యోచిస్తోంది.

ఈ ఐదు పథకాలు అమలులోకి వస్తే రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక రంగాల్లో గణనీయ మార్పులు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Sthanikam

త్వరలో తెలంగాణలో 5 కొత్త పథకాలు – రేవంత్ సర్కార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News