Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పదవి బాధ్యతలు చేపట్టిన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ డాకూర్ అశోక్ గౌడ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 06:30 PM

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

27-01-2026 444 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శోకసముద్రంలో మునిగిన సుద్దాల గ్రామం..

స్థానికం:భువనగిరి రిపోర్టర్ శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల సుద్దాల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు యమగాని బక్కయ్య మంగళవారం జీవనోపాధి కోసం తాటిచెట్టుపైకి ఎక్కి కళ్లు తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడిపోయాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న వెంటనే 108 అత్యవసర వైద్య సేవల సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బక్కయ్యను జనగామ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే ఆయన పరిస్థితి విషమించి దురదృష్టవశాత్తు మృతి చెందినట్లు సమాచారం.బక్కయ్య మృతి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు,బంధువులు,గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.రోజువారీ కష్టపడి పనిచేసే గీత కార్మికుడి అకాల మరణం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది.మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని గ్రామస్తులు,గీత కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Sthanikam

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News