Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:36 AM

తాజ్‌పూర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా తాజ్‌పూర్ గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ చంద్రబాబు, ఎస్‌హెచ్‌ఓ అనిల్ కుమార్ పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు.

సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత, పీడిత, బహుజన వర్గాల స్వేచ్ఛ, సమానత్వం కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గొప్పదని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సామాజికవేత్త డా. ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి బి. నరేందర్, ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబ్ యాకుబ్, బొమ్మారపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మి, బాల్‌రాజ్, బీట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్, మాజీ సర్పంచులు, కుల సంఘాల నాయకులు, యువకులు, మహిళలు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు.

Sthanikam

తాజ్‌పూర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News