Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 01:05 PM

తెలంగాణలో వీధి కుక్కలు – కోతుల బీభత్సం

తెలంగాణలో వీధి కుక్కలు – కోతుల బీభత్సం

తెలంగాణలో వీధి కుక్కలు – కోతుల బీభత్సం
24-12-2025 326 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజల ప్రాణాలకు ముప్పు… ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో ప్రాణంబలి

స్థానికం ప్రతినిధి రామన్న పేట

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కలు, కోతుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజల ప్రాణాలే లక్ష్యంగా మారిన ఈ సమస్యపై ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన దీనికి నిదర్శనం.

నిదానపల్లి గ్రామానికి చెందిన కడారి అంజయ్యపై సుమారు 20 రోజుల క్రితం వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ సనత్‌నగర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అంజయ్య మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

గ్రామాల్లో వీధి కుక్కల గుంపులు స్వైరవిహారం చేస్తుండగా, మరోవైపు కోతుల బెడదతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా బాధితులవుతున్నారు. అయినా సమస్య పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామాల నుంచి వీధి కుక్కలు, కోతులను నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది కొత్తగా ఎన్నికైన సర్పంచులకు కూడా పెద్ద సవాలుగా మారింది. ఇకనైనా అధికార యంత్రాంగం స్పందించకపోతే, ఇలాంటి ఘటనలు మరిన్ని ప్రాణాలను బలితీసుకునే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Sthanikam

తెలంగాణలో వీధి కుక్కలు – కోతుల బీభత్సం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News