Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 08:24 AM

తెలంగాణలో ప్రత్యేక విద్యా విధానం త్వరలో – సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

08-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టే విధానాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు.హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలపై విస్తృతంగా చర్చ జరిగింది.జాతీయ విద్యా విధానం తరహాలోనే తెలంగాణకు ప్రత్యేకమైన విద్యా విధానాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.ఈ విధాన రూపకల్పన కోసం ఇప్పటికే ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించామని, కమిటీ నివేదిక ఆధారంగా కొత్త పాలసీని త్వరలో అమలులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించడమే కాకుండా, చిన్నారులను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించే అంశంపైనా ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. దీని ద్వారా విద్యార్థుల నమోదు పెరగడంతో పాటు మధ్యలో చదువు మానేసే పరిస్థితులు తగ్గుతాయని తెలిపారు.నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ (ATCs) గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇవ్వడమే ఈ చర్యల లక్ష్యమని స్పష్టం చేశారు.విద్యా రంగంలో సమూల మార్పుల భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల రూపాయల వ్యయంతో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్కూల్స్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకేచోట మినీ యూనివర్సిటీ స్థాయిలో నాణ్యమైన విద్య, వసతి, క్రీడా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ఈ స్కూల్స్‌ను రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఏటీసీగా అభివృద్ధి చేసిన మల్లేపల్లి ఐటీఐని సందర్శించాలని హిమాచల్ ప్రదేశ్ విద్యా శాఖ మంత్రికి ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మోడల్‌పై ఆసక్తి వ్యక్తం చేసిన హిమాచల్ ప్రదేశ్ ప్రతినిధులు, వాటికి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని కోరారు.ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను పటిష్టపరచాలన్న తెలంగాణ ప్రభుత్వ విజన్‌ను హిమాచల్ ప్రదేశ్ మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో విద్యా శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణలో ప్రత్యేక విద్యా విధానం త్వరలో – సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News