Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:39 AM

తెలంగాణ అసెంబ్లీలో నేడు నీటి హక్కుల పెద్ద చర్చ

03-01-2026 159 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ నీళ్లపై మాజీ సీఎం ద్రోహం: వేముల వీరేశం

చిట్యాల స్థానికం ప్రతినిధి పల్లపు ప్రశాంత్

తెలంగాణ రాష్ట్ర నీటి అంశాలపై శాసనసభలో జరిగిన చర్చలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంశాన్ని తలుచుకుంటే రామాయణం, మహాభారతం స్థాయిలో కథలున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే జరిగిందని చెప్పే మాజీ ముఖ్యమంత్రి, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు. కృష్ణా జలాలపై గద్దర్ వంటి కళాకారులు ఉద్యమ కాలంలో ప్రజలను చైతన్యం చేశారని గుర్తు చేస్తూ, తెలంగాణ ఏర్పడ్డాక జూరాల నుంచి శ్రీశైలం వరకు ప్రాజెక్టుల రూపకల్పన ఎందుకు మార్చారో అర్థం కావడం లేదన్నారు. దీని వల్ల మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు తీవ్ర అన్యాయానికి గురయ్యాయని తెలిపారు. బ్రహ్మణవెల్లెంల, శివన్నగూడెం వంటి ప్రాజెక్టులకు ఆనకట్టలు కట్టినా నీటి వనరు ఎక్కడి నుంచి వస్తుందో స్పష్టత లేదని విమర్శించారు. నల్గొండ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను పక్కనబెట్టి ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టి, తెలంగాణ నీటి హక్కులను ఇతర రాష్ట్రాలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి మోసపూరిత చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని కోరారు.

Sthanikam

తెలంగాణ అసెంబ్లీలో నేడు నీటి హక్కుల పెద్ద చర్చ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News