Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్స్ – రెండూ కాంగ్రెస్‌కే !

18-02-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 16న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వీతో పాటు, బిఆర్ఎస్ సభ్యుడు కె.ఆర్. సురేష్ రెడ్డి పదవీకాలం ముగియనుంది.

శాసనసభలో ప్రస్తుత పార్టీల బలాబలాలను పరిశీలిస్తే, అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల గెలుపు లెక్కల ప్రకారం, రెండు స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కో అభ్యర్థి గెలవడానికి దాదాపు 40 నుండి 41 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఉన్న 64 మంది స్వంత ఎమ్మెల్యేలతో పాటు, ఇతర పార్టీల నుండి చేరిన వారితో కలిపి మొత్తం బలం 75 దాటడంతో, ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవడానికి అవసరమైన 82 ఓట్లకు కాంగ్రెస్ అత్యంత సమీపంలో ఉంది. మజ్లిస్ కూడా మద్దతుగా ఉంటుంది.

ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ పరిస్థితి ఈ ఎన్నికల్లో కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఆ పార్టీకి ప్రస్తుతం ఉన్న 27 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఒక సీటు గెలవడానికి కూడా సరిపోదు. ఎనిమిది మమంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఓటింగ్ కు హాజరు కాకపోవచ్చు. పైగా, రెండో ప్రాధాన్యత ఓట్ల విషయంలోనూ అధికార పక్షానికే స్పష్టమైన ఆధిక్యం ఉండటంతో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టినా పోటీ ఇవ్వడం కష్టమే. కాంగ్రెస్ అధిష్టానం ఒక సీటును జాతీయ స్థాయి నేతకు, మరో సీటును సామాజిక సమీకరణాల దృష్ట్యా రాష్ట్ర స్థాయి నేతకు కేటాయించే అవకాశం ఉంది.

Sthanikam

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్స్ – రెండూ కాంగ్రెస్‌కే !

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News