Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:19 AM

తెలంగాణ సాహితీ దశాబ్ది వేడుకలు – నాగార్జున కళాశాల విద్యార్థినికి జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి

24-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌లోని ఏ.వి. కళాశాల ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్లో నిర్వహించిన తెలంగాణ సాహితీ దశాబ్ది సాహిత్య వేడుకల్లో నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థిని ప్రతిభ కనబరిచింది.

తెలంగాణ సాహితీ మరియు ఏ.వి. కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో “మాదకద్రవ్య రహిత సమాజం – సుస్థిర భవిష్యత్” అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో నాగార్జున డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) బి.ఎ. ప్రథమ సంవత్సరం విద్యార్థిని పెరుమాళ్ల నిశ్చల జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించింది.

మాదకద్రవ్యాల ప్రభావంపై సమాజంలో చైతన్యం కలిగించేలా ఆమె రాసిన వ్యాసం నిర్ణయక మండలిని ఆకట్టుకుంది. అనేక కళాశాలల నుంచి పాల్గొన్న విద్యార్థుల మధ్య నిశ్చల ఆలోచనా లోతు, భాషా నైపుణ్యం ప్రత్యేకంగా నిలిచాయి.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ, విద్యార్థులు సాహిత్య, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం సమాజ నిర్మాణానికి అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ కళాశాల తరఫున సంపూర్ణ ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో అధ్యాపకులు డా. వెల్దండి శ్రీధర్, డా. మునిస్వామి, డా. బట్టు కిరీటం, డా. మల్లేశం, నర్సింగ్ కోటయ్య, హబీబ్, జాజుల దినేష్, కె. నాగరాజు, డా. అంకూస్, హస్రత్ బేగం, టంగుటూరి సైదులు, గోవర్ధన గిరి, ప్రభాకర్ తదితరులు పాల్గొని విద్యార్థినిని అభినందించారు

Sthanikam

తెలంగాణ సాహితీ దశాబ్ది వేడుకలు – నాగార్జున కళాశాల విద్యార్థినికి జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News