Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

తెలంగాణ రాష్ట్రం లో తహశీల్దార్లకు తక్షణమే పదోన్నతులు కల్పించాలి

24-02-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నికలిసిన ట్రెసా ప్రతినిధి బృందం వినతి

రాష్ట్ర రెవెన్యూ శాఖలో పదోన్నతులు నిలిచిపోవడంతో దాదాపు 150 మంది తహశీల్దార్లు పదేళ్లకు పైగా ఎదురు చూపుల్లోనే ఉన్నారని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవా సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. పదోన్నతుల నిలుపుదల కారణంగా దిగువ స్థాయి అధికారుల పదోన్నతుల ప్రక్రియ కూడా స్తబ్ధంగా మారిందని సంఘం తెలిపింది.

సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన శిబిర కార్యాలయంలో కలిసి సమగ్ర వినతిపత్రం సమర్పించింది. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రభుత్వ పథకాల అమలు, భూవివాదాల పరిష్కారం, ప్రకృతి విపత్తుల సమయంలో సేవలు, ఎన్నికల నిర్వహణ వంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్న తహశీల్దార్లకు అదనపు హోదాతో పదోన్నతులు మంజూరు చేయాలని కోరింది.

సమగ్ర ఆరోగ్య పథకానికి కృతజ్ఞతలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విరమణ పొందిన ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ఆరోగ్య నిధి ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రికి సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుందని పేర్కొంది.

ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపై అనిశ్చితి

రెవెన్యూ శాఖలో సుమారు 632 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అనేక సంవత్సరాలుగా కీలక సేవలు అందిస్తున్నారని సంఘం వివరించింది. భూ రికార్డుల నిర్వహణ, ధరణి వ్యవస్థలో నమోదు పనులు, ప్రజా సేవల అందజేత వంటి ముఖ్యమైన బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారని తెలిపింది. 2026 మార్చి 31 తర్వాత వీరి సేవలను కొనసాగించరాదన్న ఆదేశాలు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయని, శాఖలో ఖాళీలు ఉన్న నేపథ్యంలో వారి సేవలను కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది.

వేతన సవరణపై వేగం అవసరం

పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనుదారుల వేతన సవరణను త్వరితగతిన అమలు చేయాలని సంఘం కోరింది. వేతన సవరణతో లక్షలాది కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడింది.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ రాష్ట్రం లో తహశీల్దార్లకు తక్షణమే పదోన్నతులు కల్పించాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News