Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:36 AM

టీబీతో జాగ్రత్త.. ఉమ్మడి నల్గొండలో భారీగా కేసులు

24-03-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో నమోదైన కేసుల వివరాలివే..

వ్యాధి నివారణపై వైద్యుల కీలక సూచనలు.

నేడు ప్రపంచ క్షయ (టీబీ) నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నమోదైన గతేడాది గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీబీ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

గత ఏడాది కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1.20 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అందులో ఏకంగా 5,641 మందికి టీబీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. జిల్లాల వారీగా ఈ కేసుల వివరాలను పరిశీలిస్తే.. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 2,550 కేసులు నమోదు కాగా, సూర్యాపేట జిల్లాలో 1,741 కేసులు, యాదాద్రి జిల్లాలో 1,350 కేసులు నమోదయ్యాయి.

అప్రమత్తతే శ్రీరామరక్ష..

టీబీ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా రెండు వారాలకు మించి ఎడతెగని దగ్గు ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వెల్లడించారు.

సకాలంలో వ్యాధిని గుర్తిస్తే టీబీని పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి బారిన పడిన వారు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు, మంచి పౌష్టికాహారం తీసుకోవాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Sthanikam

టీబీతో జాగ్రత్త.. ఉమ్మడి నల్గొండలో భారీగా కేసులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News