Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:13 AM

స్వర్ణోత్సవాలపై సమీక్ష – భవిష్యత్ దిశగా కీలక నిర్ణయాలు

11-01-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గోపా అత్యవసర సమావేశం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) అత్యవసర సమావేశం శనివారం నాగోల్‌లోని సుప్రజా హాస్పిటల్‌లో జరిగింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీతో పాటు అన్ని జిల్లా గోపా కమిటీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ట్రెజరర్లు హాజరయ్యారు.

డిసెంబర్ 26న నిర్వహించిన గోపా స్వర్ణోత్సవాల ఘన విజయంపై సక్సెస్ మీట్‌గా ఈ సమావేశాన్ని నిర్వహించారు. స్వర్ణోత్సవాల నిర్వహణపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించగా, సంస్థ భవిష్యత్ కార్యాచరణ, సంబంధాలు–బాంధవ్యాల విస్తరణపై విస్తృతంగా చర్చించారు.సమావేశంలో గోపా సభ్యులకు సుప్రజా హాస్పిటల్ అధినేత డాక్టర్ శిగ విజయ్ కుమార్ గౌడ్ కుటుంబ హెల్త్ కార్డులను అందజేశారు. ఈ కార్డుల ద్వారా అన్ని వైద్య పరీక్షలపై, మొత్తం బిల్లుపై 30 శాతం రాయితీతో పాటు డాక్టర్ ఫీజు పూర్తిగా మాఫీ చేయనున్నట్లు తెలిపారు.అలాగే గోపా నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రాచమళ్ల అనిల్ కుమార్ గౌడ్ రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించడం విశేషంగా నిలిచింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… 50 ఏళ్ల చరిత్రను పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలు జరుపుకున్న గోపా సంస్థ రాష్ట్ర గౌడ జాతికి గర్వకారణమన్నారు. గోపాను శక్తివంతమైన సామాజిక సంస్థగా తీర్చిదిద్దిన రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కమిటీలను అభినందించారు. తన పదవీ కాలం ముగిసేలోగా కనీసం 5,000 మంది సభ్యులను చేర్చి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Sthanikam

స్వర్ణోత్సవాలపై సమీక్ష – భవిష్యత్ దిశగా కీలక నిర్ణయాలు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News