ప్రముఖ నేతలకు ఘన సన్మానం
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్‌లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్ అధ్యక్షతన జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ తరఫున వారికి ఘన సన్మానం చేశారు. నాయకులు మాట్లాడుతూ యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని ప్రజాసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి