Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:25 PM

సంతేకూడ్లూరు గ్రామానికి త్రాగునీటి సమస్యకు శుభపరిణామం

04-02-2026 405 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సంతేకూడ్లూరు గ్రామ ప్రజలు ఎన్నేళ్లుగా ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు శుభపరిణామం దక్కింది. గత పాలకుల నిర్లక్ష్యానికి గురై వేసవికాలం వచ్చిందంటే మూడు నెలల పాటు త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడిన గ్రామానికి ఇకపై ఆ కష్టాలు తీరనున్నాయి.గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో త్రాగునీటి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర దాహార్తిని అనుభవించినా అప్పటి గ్రామ నాయకులు సమస్య పరిష్కారంపై ఏమాత్రం చలనం చూపకుండా కాలం వెళ్లదీసారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది.అయితే పట్టు వదలని విక్రమార్కుల్లా పసుపు సైనికులు ముందుకు వచ్చారు. 2018 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సమ్మర్ స్టోరేజ్‌కు అనుమతి సాధించారు. కానీ అనంతరం వచ్చిన పాలకులు నాణ్యత లేకుండా పనులు చేసి, ఆ స్టోరేజ్‌ నుంచి గ్రామానికి త్రాగునీరు అందించే కనీస పైపులైన్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. స్యాంక్షన్ జాబితాలో సమ్మర్ స్టోరేజ్ కోసం భూమి ఇచ్చిన గ్రామానికే నీటి పైప్ కనెక్షన్ లేకుండా ఉండటం గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది.మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2025 జూలై నెలలో పసుపు సైనికులు గ్రామ సమస్యను రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ త్రాగునీటి సమస్యను వివరించగానే ప్రజలకు త్రాగునీరు అందించే విధంగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసి, అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వారు భరోసా ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారమే నేడు సంతేకూడ్లూరు గ్రామానికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. సమ్మర్ స్టోరేజ్ నుంచి గ్రామ చెరువుకు, అక్కడి నుంచి ఓవర్ ట్యాంక్ వరకు నీటిని సరఫరా చేసే పైపులైన్ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో గ్రామ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది.ఈ పనులు సాధ్యమయ్యేందుకు అన్ని విధాలుగా సహకరించిన ఆదోని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడికి గ్రామ ప్రజల తరఫున, పసుపు సైనికుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నో సంవత్సరాలుగా వెంటాడిన త్రాగునీటి సమస్యకు పరిష్కారం దక్కనున్న ఈ శుభఘడియ గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలవనుంది.

Sthanikam

సంతేకూడ్లూరు గ్రామానికి త్రాగునీటి సమస్యకు శుభపరిణామం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News