Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:18 AM

సంఖ్యల్లో దాగిన కాలచరిత్ర… పాత బంగ్లా గోడపై అసలీ–ఫస్లీ ఆనవాళ్లు

23-02-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నిర్మల్ పట్టణంలోని పాత ఇన్‌స్పెక్షన్ బంగ్లా గోడపై చెక్కిన రెండు వేర్వేరు సంవత్సరాల నమోదు సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఒక వైపు 1930 క్రీస్తుశకం సంవత్సరం ఉండగా, మరో వైపు 1339 ఫస్లీ సంవత్సరం చెక్కబడి ఉండటం విశేషంగా నిలిచింది. ఈ సంఖ్యలు అప్పటి పరిపాలనా కాలమానాల వైవిధ్యాన్ని గుర్తుచేస్తున్నాయి.

ప్రస్తుతం వినియోగంలో ఉన్న క్రీస్తుశకం కాలమానం పాశ్చాత్య గ్రెగోరియన్ విధానానికి చెందింది. అయితే గతంలో మొఘల్ పాలనలో ప్రవేశించిన ఫస్లీ కాలమానాన్ని తరువాత హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం అధికారిక ఆదాయ సంవత్సరంగా అమలు చేసింది. రెవెన్యూ లెక్కలు, భూసంబంధిత రికార్డులు, జమాబందీ వ్యవహారాలు అన్నీ ఫస్లీ సంవత్సరాల ప్రకారమే నిర్వహించబడేవి.

‘ఫస్లీ’ అనే పదానికి ‘పంట’ అనే అర్థం ఉంది. అందువల్ల దీనిని వ్యవసాయ సంవత్సరంగా పరిగణించారు. ఫస్లీ సంవత్సరం జూలై 1న ప్రారంభమై తదుపరి ఏడాది జూన్ 30తో ముగుస్తుంది.

ఫస్లీ సంవత్సరానికి సాధారణంగా 590 సంవత్సరాలు కలిపితే క్రీస్తుశకం సంవత్సరం వస్తుందని అధికారులు తెలిపారు. ఈ లెక్కన 1339 ఫస్లీకి 1929 సరిపోతుంది. అయితే ఫస్లీ సంవత్సరం రెండు క్రీస్తుశకం సంవత్సరాలకు వ్యాపించడంతో భవనంపై 1930గా నమోదు చేసినట్లు భావిస్తున్నారు.

తెలంగాణలోని పలు పాత ప్రభుత్వ భవనాలు, న్యాయస్థానాలు, రెవెన్యూ కార్యాలయాలపై ఇప్పటికీ ఫస్లీ సంవత్సరాల ముద్రలు కనిపిస్తుండటం ఆ కాలపు పరిపాలనా విధానాలకు నిదర్శనంగా నిలుస్తోంది. పాత నిర్మాణాల గోడలపై చెక్కిన ఈ సంఖ్యలు ప్రాంత చరిత్రను మౌనంగా చెప్పుకుంటున్నాయి.

Sthanikam

సంఖ్యల్లో దాగిన కాలచరిత్ర… పాత బంగ్లా గోడపై అసలీ–ఫస్లీ ఆనవాళ్లు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News